Renuka Talwar: బంగ్లా ఖరీదే వందల కోట్లు.. ఆమె సంపద తెలిస్తే అవాక్కవుతారు!

2 Oct, 2023 10:12 IST|Sakshi

దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిది అంటే.. ముందుగా చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ ఆదానీ వంటి పారిశ్రామికవేత్తల పేర్లే గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలో మాత్రం అత్యంత ఖరీదైన ఇల్లు ఒక మహిళకు చెందింది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ ఇంటి ఖరీదు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Renuka Talwar Expensive House In Delhi

ఢిల్లీలో ఖరీదైన ఇల్లు కలిగిన మహిళ పేరు 'రేణుకా తల్వార్'. ఈమె ప్రముఖ రియల్ ఎస్టేట్ 'కేపీ సింగ్' కుమార్తె. ఈమె కొనుగోలు చేసిన ఇల్లు పృథ్వీరాజ్ రోడ్‌లో ఉంది. టీడీఐ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ డెవలపర్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమల్‌ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించినట్లు సమాచారం.

2016లో ఈ బంగ్లాను రూ. 435 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీని ధర రూ. 510 కోట్లు వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఒకటిగా నిలిచింది. దీని విస్తీర్ణం దాదాపు 5000 చ.మీ కాగా ఇంటి నిర్మాణ ప్రాంతం రూ. 1189 చ.మీ. అంటే ఈ భారీ విలాసవంతమైన ఇల్లు చదరపు మీటరు ఖరీద్దు ఏకంగా రూ. 8.8 లక్షలు. 

Renuka Talwar Net Worth 2023

ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..

రేణుకా తల్వార్ కంటే ముందు, ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన పృథ్వీరాజ్ రోడ్‌లో షాహీ ఎక్స్‌పోర్ట్స్ హరీష్ అహుజా రూ. 173 కోట్లతో ఖరీదైన భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న రేణుకా తల్వార్ బంగ్లా పరిమాణంలో సగం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నికర సంపద విలువ ఏకంగా రూ. 2780 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

మరిన్ని వార్తలు