ప్రేమలో పడిన మిలిందా గేట్స్‌, కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

11 Nov, 2022 14:01 IST|Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ డేటింగ్‌ అంశం అమెరికా మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. మిలిందా  60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది.

ఫాక్స్ న్యూస్‌మాజీ కరస్పాండెంట్, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్‌  జోన్ డు ప్రీతో మళ్లీ ప్రేమలో పడ్డారని  టీఎంజెడ్‌  సహా  మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని నివేదించింది. అంతేకాదు   కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఈ జంట,  కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు బస చేసినట్లు కూడా  రిపోర్ట్‌  చేసింది. 

కాగా బిల్ గేట్స్‌, మిలిందా గేట్స్ 27 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ ఆగస్టు 2021లో విడాకుల అంశాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చారు బిల్‌గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానంటూ  మిలిందా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు. మరోవైపు తాజా కథనాలపై మిలిందాగ గానీ, జాన్ డ్యూ ప్రీ గానీ ఇంతవరకు స్పందించలేదు.

మరిన్ని వార్తలు