FedEx: ఏకంగా ఆ ఉద్యోగులకే షాక్‌, 10 శాతం ఔట్‌

2 Feb, 2023 15:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ ఫెడ్‌ఎక్స్‌ కార్పో కూడా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. అమెరికాలో ఇప్పటికే 12వేల మంది సాధారణ ఉద్యోగులను  తొలగించిన సంస్థ  ఇపుడికి  మేనేజ్‌మెంట్‌ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునేందుకు నిర్ణయంచింది. 
 
షిప్పింగ్ మందగమనం నేపథ్యంలో  ఫెడెక్స్ కార్ప్ తన గ్లోబల్ మేనేజ్‌మెంట్ సిబ్బందిలో 10 శాతం కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈమేరకు తమ సిబ్బందికి ఈమెయిల్‌ సమాచారాన్ని అందించింది.  అలాగే  కంపెనీ  ఆఫీసర్ , డైరెక్టర్ ర్యాంక్‌ల పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు , కొన్ని టీంలను కలిపివేస్తున్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్  రాజ్ సుబ్రమణ్యం వెల్లడించారు. సంస్థ అభివృద్ధి కోసం దురదృష్టవశాత్తూ ఇలాంటి నిర్ణయం  తీసుకోక తప్పలేని పేర్కొన్నారు.  డిసెంబరులో దాని ఇటీవలి ఆర్థిక ప్రకటన ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 550,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు