కరోనా ఉధృతి: ఆర్‌‌బీఐ కీలక నిర్ణయం

7 Apr, 2021 10:12 IST|Sakshi

కరోనా వ్యాప్తి, ఆంక్షల నేపథ్యంలో ఆర్‌బీఐ యధాతథ నిర్ణయం

రెపో రేటు 4 శాతం 

రివర్స్‌ రెపో రేటు 3.5 శాతం

సాక్షి, ముంబై:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్‌ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం  వెల్లడించారు.  రేట్లను  యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ తన ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్  కేసులు పెరగడం, తాజా ఆంక్షలునేపథ్యంలో బెంచ్మార్క్ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని శక్తి కాంత్‌దాస్‌ వివరించారు. వృద్ధికి తోడ్పడటానికి , ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధించడానికే  ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  రెండో దశలో విజృంభిస్తున్న కోవిడ్‌ మహమ్మారి ఆర్థికవృద్ధి, రికవరీపై అనిశ్చితిని సృష్టించిందని గవర్నర్ చెప్పారు.  అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి  జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా,  సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగానూ అంచనా వేసిందన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు