హైదరాబాద్‌లోనే ఇళ్ల ధర పెరిగింది

2 Apr, 2021 11:42 IST|Sakshi

హైదరాబాద్‌లోనే  ఇళ్ల ధర పెరిగింది

2020 క్యూ 4 లో  ఇళ్ల ధరలు  పుంజుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇళ్ల ధరల పెరుగుదల విషయంలో 2020 అక్టోబరు-డిసెంబరు కాలంలో టాప్‌-150 గ్లోబల్‌ అర్బన్‌ సిటీస్‌ జాబితాలో భారతీయ నగరాలు వెనుకంజలో ఉన్నాయి.నైట్ ఫ్రాంక్  తాజా నివేదిక ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ క్యూ 4 2020’ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో గృహాల ధరలు 2020 లో సగటున 5.6శాతం పెరిగాయి. ఇది 2019 లో 3.2శాతం మాత్రమే. ముఖ్యంగా 2020 క్యూ 4 లో  ఇళ్ల ధరలు  పుంజుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్‌ కావడం విశేషం. 

నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక ప్రకారం.. జాబితాలో చోటు సంపాదించుకున్న ఎనిమిది భారతీయ నగరాల్లో హైదరాబాద్‌ మాత్రమే 0.2 శాతం వార్షిక వృద్ధి సాధించి 122 ర్యాంకును దక్కించుకుంది. 150వ ర్యాంకు సాధించిన చెన్నైలో గృహాల ధరలు 9 శాతం తగ్గాయి. బెంగళూరులో 0.8 శాతం, అహ్మదాబాద్‌ 3.1, ముంబై 3.2, ఢిల్లీ 3.9, కోల్‌కత 4.3, పుణేలో 5.3 శాతం తగ్గాయి. తొలి ర్యాంకు కైవసం చేసుకున్న టర్కీలోని అంకారాలో ఇళ్ల ధరలు 30.2 శాతం అధికమయ్యాయి. 2019తో పోలిస్తే అంతర్జాతీయంగా గతేడాది 150 నగరాల్లో గృహాల ధరల సగటు వృద్ధి 5.6 శాతం నమోదైంది. 2019లో ఈ వృద్ధి 3.2 శాతంగా ఉంది. 2020లో 81 శాతం నగరాల్లో ధరలు పెరిగాయి.

మరిన్ని వార్తలు