Sequoia Capital: తప్పు చేస్తే సహించేదేలే..! అష్నీర్‌కు భారత్‌పే ఇన్వెస్టర్ల వార్నింగ్‌!

18 Apr, 2022 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పేలో జరుగుతున్న వివాదాలపై తాజాగా సీక్వోయా క్యాపిటల్‌ తీవ్రంగా స్పందించింది. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేసింది. ఉద్ధేశపూర్వకంగా అవకతవకలకు తెరతీస్తే తగిన విధంగా స్పందించనున్నట్లు తెలియజేసింది.

వాటాదారులు, ఉద్యోగులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో వెనకడుగు వేయబోమని, అవసరమైతే ఆర్థికంగా సైతం ఎదుర్కోనున్నట్లు వివరించింది.

భారత్‌పేలో సీక్వోయా క్యాపిటల్‌కు 19.6 శాతం వాటా ఉంది. కంపెనీ సక్రమంగా వ్యవహరించే విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ఇటీవల కంపెనీ మాజీ చీఫ్‌ అష్నీర్‌ గ్రోవర్‌పై భారత్‌పే బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన అన్ని టైటిల్స్, పొజిషన్ల నుంచి గ్రోవర్‌ను తప్పించింది.   

చదవండి: ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్‌' నిధుల దుర్వినియోగంపై సమీర్‌!

మరిన్ని వార్తలు