రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌కు ఎన్ఆర్ఐల నుంచి భారీ స్పందన

22 Nov, 2021 15:38 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌లో రిటైల్‌ మదుపర్లు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) రూపొందించిన రెండు కీలక పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న ప్రారంభించిన సంగతి తేలిసిందే. అయితే, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్‌ డైరెక్ట్‌ పథకం కింద ఖాతాలను తెరవడానికి ప్రవాస భారతీయుల నుంచి గణనీయమైన స్పందన వస్తుంది. "యుఎస్, యుకె, సింగపూర్, దుబాయ్ దేశాలతో సహ ఇతర దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐ పెట్టుబడిదారుల నుంచి మాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయని సినెర్గీ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ దలాల్ చెప్పారు. 

ఎన్ఆర్ఐలు తమ ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తమ తల్లిదండ్రుల ఖర్చుల కోసం లేదా భారతదేశంలో తమ ఆస్తిని పెంపొందించుకోవడానికి రిటైల్‌ డైరెక్ట్‌ పథకం వంటి దీర్ఘకాలిక రుణాల నుంచి స్థిరమైన ఆదాయ కోసం చూస్తున్న ఎన్ఆర్ఐలు ఈ బాండ్లను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారని దలాల్ తెలిపారు. కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ ప్రకటించిన రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ కింద ఒక ఎన్ఆర్ఐ విదేశాల్లో కూర్చొని తన ఖాతాను తేరిచి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో వడ్డీ రేట్లు కేవలం 1-2% పరిధిలో ఉన్నందున, భారత ప్రభుత్వం బాండ్లపై ఇస్తున్న 6.5-7% వడ్డీ రేట్లు పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది అని అన్నారు.

(చదవండి: అదిరే ఫీచర్లతో 5జీ ఫోన్‌, చేతులు కలిపిన జియో - షావోమీ!)

రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ పేరిట వచ్చిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు రిటైల్‌ మదుపర్లకు కొత్త మార్గం లభించనుంది. అలాగే మదుపర్లు ఉచితంగా ఆర్‌బీఐ వద్ద ఆన్‌లైన్‌లో సులభంగా తమ ప్రభుత్వ సెక్యూరిటీ ఖాతాను తెరిచి నిర్వహించుకోవచ్చు. అలాగే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనొచ్చు, విక్రయించవచ్చు. "ఈ బాండ్లు స్థిరమైన రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి మీరు ప్రతి నెల కచ్చితంగా వడ్డీ లభిస్తుంది. అలాగే, మీరు అన్ని పెట్టుబడులను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చు" అని రూంగ్టా సెక్యూరిటీస్ చీఫ్ ఫైనాన్షియల్ ప్లానర్ హర్షవర్ధన్ రూంగ్టా అన్నారు.

(చదవండి: Paytm ఢమాల్‌.. రెండు రోజుల్లో పదివేల కోట్ల లాస్‌!)

మరిన్ని వార్తలు