గాడిలో పడ్డ వ్యాపారం

14 Oct, 2021 06:41 IST|Sakshi

పూర్వపు స్థాయికి రిటైల్‌ విక్రయాలు: రాయ్‌

న్యూఢిల్లీ: రిటైల్‌ అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగ్గా ఉన్నట్టు రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయ్‌) ప్రకటించింది. కరోనా ముందు నాటి విక్రయాల్లో 96 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. 2020 సెపె్టంబర్‌లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే 2021 సెపె్టంబర్‌లో 26 శాతం వృద్ధి కనిపించినట్టు తెలిపింది. దక్షిణాది 33 శాతం వృద్ధితో ముందుండగా.. తూర్పు భారత్‌లో 30 శాతం, పశి్చమ భారత్‌లో 26 శాతం చొప్పున అమ్మకాలు పుంజుకున్నాయి.

ఉత్తరాదిలోనూ 16 శాతం అధికంగా అమ్మకాలు జరిటినట్టు తెలిపింది. వినియోగదారు సెంటిమెంట్‌ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని రాయ్‌ పేర్కొంది. ‘‘కన్జ్యూమర్‌ డ్యురబుల్స్, ఎల్రక్టానిక్స్, ఆహారం, గ్రోసరీ, క్విక్‌ సరీ్వస్‌ రెస్టారెంట్లు కరోనా ముందు నాటి స్థాయికి పూర్తిగా కోలుకున్నాయి. క్రీడా ఉత్పత్తులు, వ్రస్తాలు కూడా గణనీయంగా పుంజుకున్నాయి. సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు (సెలూన్, పాదరక్షలు, ఆభరణాలు) ఇంకా కరోనా ముందస్తు నాటికి చేరుకోవాల్సి ఉంది’’అని రాయ్‌ తెలిపింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు