బాబోయ్.. ఆ రంగంలో ఉద్యోగాలు, మాకొద్దంటున్న గ్రాడ్యుయేట్లు!

9 Oct, 2022 16:56 IST|Sakshi

కరోనా మహమ్మారి దెబ్బకు చాలా రంగాలు డీలా పడడంతో పాటు కొన్ని రంగాల్లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిటైల్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ క్రమంగా తగ్గుతోంది. గడిచిన రెండేళ్ల కాలంలో రిటైల్‌ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య 11.80 శాతం తగ్గినట్లు గ్లోబల్ జాబ్ సైట్ ఇన్‌డెడ్ నివేదికలో పేర్కొంది.

కరోనా కంటే ముందు మూడేళ్లలో 5.50 శాతం వృద్ధి నమోదైన ఈ రంగంలో..  ఆ తర్వాత మాత్రం 11.80 శాతం తగ్గినట్లు నివేదికలో వెల్లడించింది. గత సంవత్సరం లాక్‌డౌన్‌,  వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రజలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికే మొగ్గు చూపారు. దీంతో రీటైల్‌ రంగంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా, ఉద్యోగార్థులకు ఆసక్తి  తగ్గినట్లు తెలుస్తోంది.

నివేదికలోని డేటా వివరాలు ప్రకారం ఉద్యోగార్ధుల ఆసక్తి.. స్టోర్ మేనేజర్ (15 శాతం), రిటైల్ సేల్స్ అసోసియేట్ (14.4 శాతం), క్యాషియర్ (11 శాతం), బ్రాంచ్ మేనేజర్ (9.49 శాతం), లాజిస్టిక్స్ అసోసియేట్ (9.08 శాతం) వంటి పోస్ట్‌లకు మాత్రం డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా రిటైల్‌ రంగ ఉద్యోగ అవకాశాలు కలిగిన నగరాల్లో బెంగళూరు 12.26 శాతం వాటాతో తొలి స్థానంలో ఉండగా, ముంబై 8.2 శాతం, చెన్నై 6.02 శాతం తర్వాత స్థానంలో ఉన్నాయి.

చదవండి: 400 డేంజరస్ యాప్స్, మీ ఫోన్లలో ఇవి ఉంటే..వెంటనే ఇలా చేయండి!

>
మరిన్ని వార్తలు