‘మాకు ఓ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ ఉంటే చూడరా’.. వీడియో వైరల్‌!

14 Feb, 2024 15:34 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఆయా టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. వాళ్లకి ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాలు వంటి వాటిని నిలిపివేస్తున్నాయి (గూగుల్‌ ఆపని ఎప్పుడో చేసింది).   

ఈ తరుణంలో ప్రముఖ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ తన ఉద్యోగులతో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ వాతావరణం ఎలా ఉంటుంది? తమకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే విషయాల్ని వెల్లడించారు. 

ఆ వీడియోలో ఆహ్లదకరమైన క్యాంపస్, ఫ్రీ స్నాక్స్, ఎన్ఏపీ రూమ్‌, పని చేసేందుకు అనువైన వాతావరణం ఉన్నాయంటూ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు చెప్పారు. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో సిబ్బంది కోసం సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన క్యాంపస్‌లో హైటెక్ భద్రతా వ్యవస్థలతో మూడు భవనాలు ఉన్నాయి.

A post shared by twosisterslivingtheirlife (@twosisterslivingtheirlife)

ఆఫీస్‌లోని ప్రతి ఫ్లోర్‌లో కాఫీ, టీ, పండ్లు, డ్రింక్స్‌తో పాటు ఇతర వంటలను ఆరగించేందుకు భారీ కిచెన్‌ రూములు, రెస్ట్‌ తీసుకునేందుకు గదులు సైతం ఉన్నాయంటూ ఉద్యోగులు వర్క్‌ ప్లేస్‌ గురించి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. రీల్‌కు మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. ఉద్యోగులు వీడియో సంపూర్ణంగా ఉందంటూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ని షేర్‌ చేసింది.  

అయితే, ఆ వీడియో చూసిన నెటిజన్‌లు మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. మిమ్మల్ని చూస్తుంటే మాకు అసూయగా ఉంది. మాకు కూడా మైక్రోసాఫ్ట్‌లో జాబ్స్‌ ఉన్నాయా? మేం చేరుతాం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న సిబ్బంది మాత్రం మేం క్యాంపస్‌ వాతావరణాన్ని కోల్పోతున్నామని నిట్టూర్చుతున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు