రివోల్ట్ మోటార్స్ ఆర్ వీ 400 ఎలక్ట్రిక్ బైక్ సేల్స్ ప్రారంభం

11 Jul, 2021 19:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మోటో సైకిల్ తయారీ కంపెనీ రివోల్ట్ మోటార్స్ తన కొత్త బ్యాచ్ ఆర్ వీ400 ఎలక్ట్రిక్ బైకులు వినియోగదారులకు డెలివరీ కోసం అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. హర్యానాలోని మనేసర్ లోని గ్రీన్ ఫీల్డ్ తయారీ కర్మాగారం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ బైక్ లను పంపిస్తున్నట్లు రివోల్ట్ మోటార్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గత కొద్ది రోజుల క్రితం సేల్ కి వచ్చిన కొన్ని గంటల్లోనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అమ్ముడుపోవడంతో బుకింగ్స్ వెంటనే మూసివేసినట్లు కంపెనీ తెలిపింది. ఫ్లాగ్ షిప్ మోడల్ బైక్ ఆర్ వీ400కు కొనుగోలుదారుల నుంచి ఎల్లప్పుడూ "భారీ డిమాండ్" ఉందని తెలిపింది. 

రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో సేవలు అందిస్తుంది. "బుకింగ్లు జరిగిన కొద్ది రోజుల్లోనే కంపెనీ తన కస్టమర్లకు సాధ్యమైనంత త్వరలో ఈ మోటార్ సైకిళ్లను డెలివరీ చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు" రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ బిజినెస్ చైర్మన్ అంజలి రట్టన్ తెలిపారు. ఆర్ వీ400 3.24-కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 72 వోల్ట్ల పవర్ అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఈ బైక్ బ్యాటరీ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 1,50,000 కి.మీ వారెంటీతో వస్తుంది. మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు ఫ్రీ సర్వీసింగ్ అందిస్తుంది. 

మరిన్ని వార్తలు