అక్కడి కొనుగోలుదారులకు పండగే.. రివోల్ట్ కొత్త డీలర్‌షిప్స్ షురూ!

26 Feb, 2023 15:07 IST|Sakshi

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని 'రివోల్ట్ మోటార్స్' భారతీయ మార్కెట్లో మరో మూడు డీలర్‌షిప్‌లను విస్తరించింది. కంపెనీ ఇప్పుడు ఈ రిటైల్ స్టోర్లను ఇండోర్, గౌహతి, హుబ్లీ ప్రాంతాల్లో ప్రారభించింది.

రివోల్ట్ మోటార్స్ ప్రారంభించిన ఈ మూడు కొత్త డీలర్‌షిప్‌లతో కలిపి కంపెనీ డీలర్‌షిప్‌ల సంఖ్య 35కి చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని డీలర్‌షిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. రట్టన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్  ఇటీవలే రివోల్ట్ మోటార్స్‌లో 100 శాతం వాటాను పొందింది. భారతదేశంలో 70కి పైగా కొత్త స్టోర్‌లను ప్రారంభించాలానే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది.

రివోల్ట్ మోటార్స్ ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ మోడల్ RV400 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీలను 2023 మార్చి 31 నాటికి పొందవచ్చు. ఇప్పటికే ఈ బైక్ విరివిగా దేశీయ మార్కెట్లో అమ్ముడవుతోంది.

రివోల్ట్ ఆర్‌వి400 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.

రివోల్ట్ ఆర్‌వి400 గంటకు ఎకో మోడ్‌లో 45 కిమీ, నార్మల్ మోడ్‌లో 65 కి.మీ, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ కేవలం మూడు గంటల్లో 75 శాతం, 4.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ బైక్ బ్యాటరీపై 6 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది.

మరిన్ని వార్తలు