ఈ బైక్‌పై ఏకంగా రూ.28 వేల తగ్గింపు

18 Jun, 2021 00:20 IST|Sakshi
రివోల్ట్‌ ఆర్‌వీ 400 బైక్‌

ఈవీ బైక్‌పై రూ.28 వేలు తగ్గించిన రివోల్ట్‌ మోటార్స్‌

ముంబై: ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ రివోల్ట్‌ మోటార్స్‌ తన ఆర్‌వీ 400 మోడల్‌ ధరపై రూ.28,201 తగ్గించింది. ధర కోత తర్వాత ఎక్స్‌–షోరూమ్‌ బైక్‌ ధర రూ.90,799గా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇటీవల ఫేమ్‌-2 పథకాన్ని సవరించింది. ఇందులో భాగంగానే ఈ మోడల్‌ ధరల్ని తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. రివోల్ట్‌ ఈ–బైక్‌లో 3.0 కిలోవాట్‌ ఎలక్ట్రిక్‌ మోటారు ఉంది. ఇది 3.24 కిలోవాట్‌ లిథియం–అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.

ఒకసారి పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.  గతవారంలో కేంద్రం సవరించిన ఫేమ్‌–2 నిబంధనల ప్రకారం... ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు 1కిలోవాట్‌/అవర్‌కు రూ.10 వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీ రూ.15 వేలకు పెరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో టాటా మోటార్స్‌ కంపెనీ తన ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ వాహనంపై రూ.11,250లను తగ్గించింది. అలాగే ఒకినావా ఆటోటెక్‌ ఈవీ పోర్ట్‌ఫోలియో ధరలు కనిష్టంగా రూ. 7,209, గరిష్టంగా రూ. 17,892లు చొప్పున తగ్గాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు