బైక్ కొనేవారికి రివోల్ట్ మోటార్స్ శుభవార్త!

15 Oct, 2021 16:05 IST|Sakshi

ఒక పక్క రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుంటే.. మరోపక్క ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెరిగిపోతుంది. ఒకప్పుడు ఏడాదికి ఒకటో, రెండో ఎలక్ట్రిక్ బైక్ ప్రోడక్ట్స్ బయటికి వస్తే.. ఇప్పుడు నెలకు ఒక కొత్త బైక్/స్కూటర్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఇప్పటికే తమ బైక్/స్కూటర్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఇప్పుడు సంస్థను విస్తరించే పనిలో పడ్డాయి. కంపెనీ విస్తరించే పనిలో భాగంగా రివోల్ట్ మోటార్స్ కొత్తగా మరో 64 నగరాల్లో షోరూమ్ ఓపెన్ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో 6 నగరాల్లో మాత్రమే షోరూమ్ అందుబాటులో ఉంది.(చదవండి: పండగనాడు వదల్లేదు.. మళ్లీ బాదేశారు)

70 నగరాల్లో..
రివోల్ట్ మోటార్స్ ఆ సంఖ్యను 2022 ప్రారంభంనాటికి 70కి విస్తరించాలని యోచిస్తోంది. అలాగే, ఈవీ మేకర్ అక్టోబర్ 21, మధ్యాహ్నం 12న తన ఫ్లాగ్ షిప్ బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ రివోల్ట్ ఆర్​వీ400 బుకింగ్స్ తిరిగి ఓపెన్ చేసింది. ఇక నుంచి దేశంలోని ఈ 70 నగరాల్లోని ప్రజలు రివోల్ట్ ఆర్​వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బైక్ ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ఎంపిక చేసిన భారతీయ నగరాల్లో మాత్రమే కొనుగోలుకు అవకాశం ఉంది. అదే సమయంలో బెంగళూరు, కోల్ కతా, జైపూర్, సూరత్, చండీగఢ్, లక్నో, ఢిల్లీతో సహ మరిన్ని ఇతర ప్రధాన భారతీయ నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
 
ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో హైదరాబాద్(జూబ్లీ హిల్స్), వరంగల్ నగరాల్లో.. ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలలో అందుబాటులోకి రానుంది. 72వీ 3.24 కిలోవాట్స్​ లిథియన్​ ఇయాన్ బ్యాటరీతో గల 3కిలోవాట్​ మోటార్​తో ఆర్​వీ 400 బైక్ నడుస్తుంది. ఈ బైక్ టాప్​ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్​, స్పోర్ట్స్​ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్​ ఇందులో ఉన్నాయి. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వరకు వెళ్లనుంది. అంతేగాక, ఇది మైరివోల్ట్ అనే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో వస్తుంది.(చదవండి: జియో ఫోన్‌పై మరో రూమర్‌, అదే నిజమైతే..!)

మరిన్ని వార్తలు