Ram Gopal Varma: ఏ సినిమా ఇండస్ట్రీ చేయని ప్రయోగం చేస్తోన్న ఆర్‌జీవీ..!

26 Oct, 2021 21:26 IST|Sakshi

ఆర్జీవీ అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. మనోడు ఏదీ చేసిన ఒక కొత్తే. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో సినిమాలను డైరక్ట్‌ చేస్తుంటాడు ఆర్జీవీ. రాజ్‌ పాల్‌ యాదవ్‌, ఆప్సరా రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన లెస్బియన్‌ చిత్రం డేంజరస్‌ త్వరలోనే సరికొత్త రికార్డును సృష్టించనుంది. 

ఎన్‌ఎఫ్‌టీ రూపంలో డేంజరస్‌...!
భారత్‌లో క్రిప్టోకరెన్సీతో సమానంగా పలు సెలబ్రిటీలు నాన్‌ఫంజిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎఫ్‌టీ)పై ఆదరణను చూపిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సన్నిలియోన్‌, సల్మాన్‌ ఖాన్‌, దినేష్‌ కార్తీక్‌, రిషబ్‌పంత్‌ లాంటి వారు తమ వీడియోలను, ఆడియోలను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో బ్లాక్‌ చెయిన్‌లో విక్రయించే ఏర్పాట్లలో ఉన్నారు. కాగా ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ చేయలేని ప్రయోగానికి ఆర్జీవీ సిద్దమయ్యాడు.
చదవండి: సన్నీలియోన్‌ అరుదైన ఫీట్‌.. తన ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్స్‌తో వేలం

రామ్‌ గోపాల్‌ వర్మ డైరక్ట్‌చేసిన చిత్రం డేంజరస్‌ను  బ్లాక్‌ చెయిన్‌  ఎన్‌ఎఫ్‌టీగా విక్రయించబడుతోందని  ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్‌ ఫిల్మ్‌ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. డేంజరస్‌ సినిమాను థియేటర్స్‌లోనే కాకుండా  పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో, పే పర్‌ వ్యూ ద్వారా ప్రేక్షకులు చూడవచ్చును. ఈ సినిమాను డేంజరస్‌ టోకెన్స్‌ లేదా క్రిప్టోకరెన్సీతో మన ఇండియన్‌ కరెన్సీతో కొనుగోలు చేయవచ్చును.  అందుకోసం సపరేట్‌గా rgvdangertoken.com వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు.

ఆర్జీవీ ప్రకటన ప్రకారం..డేంజరస్‌ సినిమాను ప్రేక్షకులు  డేంజర్‌ టోకెన్లతో కొనుగోలు లేదా ఇన్వెస్ట్‌ కూడా చేయవచ్చును. డేంజరస్‌ సినిమాను సుమారు 6 లక్షల యూనిట్లుగా విలువగట్టారు. ఒకో యూనిట్‌ విలువ రూ. 100 సమానం. ఇన్వెస్టర్లు 5 లక్షలకు పైగా యూనిట్లను సొంతం చేసుకోవచ్చును. ఒకే ఇన్వెస్టర్‌ ఈ మొత్తాన్ని కూడా దక్కించుకోవచ్చును. మిగిలిన లక్ష యూనిట్లను ఆర్జీవీ, చిత్ర బృందం దగ్గర ఉండనున్నాయి. దీంతో సినిమా నుంచి వచ్చే లాభాలను ఇన్వెస్టర్లు కూడా పొందుతారు. పే పర్‌ వ్యూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన వ్యూస్‌ మేరకు ఇన్వెస్టర్లకు డబ్బులు కేటాయించడం జరుగుతుంది. 

ఎన్‌ఎఫ్‌టీ అంటే..!
ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్‌ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి  వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్‌ఎఫ్‌టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్‌లో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. 


చదవండి: సల్మాన్‌ ఖాన్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత...!

మరిన్ని వార్తలు