డేంజరస్‌ సేల్స్‌.. ఆర్జీవీనా మజాకా ! మూవీ బిజినెస్‌లో మరో యాంగిల్‌

3 Nov, 2021 14:26 IST|Sakshi

Rgv Dangerous Movie: డేంజరస్‌ సినిమా బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలోనూ అదరగొడుతోందని దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. ఈ సినిమాను నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లుగా అందుబాటులో ఉంచగా అవన్ని హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయని ఆయన వెల్లడించారు.

టోకెన్లు సోల్డ్‌ అవుట్‌
వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్‌ సినిమాను ప్రపంచంలోనే తొలిసారిగా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ) పద్దతిలో రిలీజ్‌ చేస్తున్నట్టు గత వారం ప్రకటించారు. మొత్తం ఆరు లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో ఐదు లక్షల టోకెన్లు వేలానికి అందుబాటులో ఉంచి సినిమా యూనిట్‌ దగ్గర కేవలం లక్ష టోకెన్లు ఉంచుకున్నారు. తాజాగా ఐదు లక్షల టోకెన్లు అమ్ముడైనట్టు వర్మ వెల్లడించారు. సినిమా యూనిట్‌ దగ్గరున్న లక్ష యూనిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ఏది చేసినా సంచలనమే
క్రియేటివ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. శివ మూవీతో మూవీ మేకింగ్‌ లెక్కలనే మార్చేసిన వర్మ ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో సరికొత్త పంథాకు తెర లేపారు. గతంలో విష్ణుతో చేసిన అనుక్షణం సినిమాను డిస్ట్రిబ్యూషన్‌ని ఓపెన్‌ మార్కెట్‌లో ఉంచారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డేంజరస్‌ సినిమాను బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై పని చేసే నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లుగా అమ్మకానికి పెట్టారు.  

చదవండి: ఏ సినిమా ఇండస్ట్రీ చేయని ప్రయోగం చేస్తోన్న ఆర్‌జీవీ..!

మరిన్ని వార్తలు