దాల్మియా భారత్‌ రిఫ్రాక్టరీస్‌ విక్రయం

21 Nov, 2022 06:10 IST|Sakshi

డీల్‌ విలువ రూ. 1,708 కోట్లు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ దాల్మియా భారత్‌కు చెందిన దేశీ రిఫ్రాక్టరీ బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు వియన్నా కంపెనీ ఆర్‌హెచ్‌ఐ మ్యాగ్నెసిటా తాజాగా పేర్కొంది. దాల్మియా భారత్‌ రిఫ్రాక్టరీస్‌ లిమిటెడ్‌(డీబీఆర్‌ఎల్‌)కు చెందిన రిఫ్రాక్టరీ బిజినెస్‌ కొనుగోలుకి రూ. 1,708 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్‌హెచ్‌ఐ మ్యాగ్నెసిటా సీఈవో స్టీఫెన్‌ బోర్గాస్‌ వెల్లడించారు.

ఆర్‌హెచ్‌ఐ మ్యాగ్నెసిటా ఇండియాకు చెందిన షేర్ల మార్పిడి ద్వారా డీల్‌ను పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. డీబీఆర్‌ఎల్‌.. తమ బిజినెస్‌ను దాల్మి­­­యా ఓసీఎల్‌కు బదిలీ చేయనుంది. తదుపరి డీవోసీఎల్‌ పూర్తి ఈక్విటీని 27 మిలియన్‌ ఆర్‌హెచ్‌ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేర్ల జారీ ద్వారా వియన్నా కంపెనీ సొంతం చేసుకోనుంది. ఆర్‌హెచ్‌ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేరు జారీ ధర రూ. 632.50తో చూస్తే డీల్‌ విలువను 20.8 కోట్ల యూరోలు(సుమారు రూ. 1,708 కోట్లు)గా స్టీఫెన్‌
తెలియజేశారు.

మరిన్ని వార్తలు