రెడిక్యులస్‌..నా పాపులారిటీ తగ్గుతోందంటావా? ట్విటర్‌ ఉద్యోగిపై వేటు

11 Feb, 2023 11:13 IST|Sakshi

అనుకోకుండా డేటా డిలీట్‌ వల్లే ట్విటర్‌ డౌన్‌

ట్వీట్స్‌ ఎంగేజ్‌మెంట్‌  తగ్గపోవడంపై  మస్క్‌ అసహనం

అసలు విషయం చెప్పిన ఇంజనీర్‌పై వేటు

సాక్షి,ముంబై:  ట్విటర్‌ ఇంజనీర్‌ ఉద్యోగి ఒకరు పొరపాటున డేటాను డిలీట్‌ చేయడమే బుధవారం నాటి సర్వర్‌ డౌన్‌ సమస్యకు కారణమని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగాల కోత నేపథ్యంలో బుధవారం టెక్నికల్‌  సమస్యను పరిష్కరించే నాధుడే లేకపోయాడట.  ట్విటర్‌ యూజర్ల ట్వీట్లు, ఫాలోవర్లు తదితర అంశాలపై ట్విటర్‌ కొత్త నిబంధనలను ప్రకటించింది.  ఈ సెటింగ్స్‌ నిర్వహణలోనే  యాక్సిడెంటల్‌గా డేటా  డిలీట్‌ అయిందట.

ఇది ఉలా ఉంటే మరో కీలక పరిణామం మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. వెర్జ్ నివేదిక ప్రకారం ట్విటర్‌   మస్క్‌ తన అకౌంట్‌ను ఒక రోజు ప్రయివేట్‌ ఖాతాగా మార్చాడు. తద్వారా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుందా, లేదా, తన ట్వీట్ల ఎంగేజ్‌మెంట్‌, ప్రభావం తదితర విషయాలపై స్టడీ చేస్తున్నాడట. ఈ మేరకు ఇంజనీర్లు, సలహాదారుల బృందంతో రివ్యూ చేస్తున్నాడు.

అయితే ఈ పరిశీలనలో తనకు 100 మిలియన్లకు మించి  ఫాలోయర్లు ఉండగా కేవలం పదివేల ఇంప్రెషన్‌లు మాత్రమే వస్తున్నాయని  తెలిసి మస్క్‌ అసహనంతో రగిలి పోయాడు.  దీనిపై  అసంతృప్తితో మస్క్‌ ఇచ్చిన వివరణను అంగీకరించని ఉ‍ద్యోగిపై వేటు వేశాడు మస్క్‌.   రెడిక్యూలస్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని నివేదించింది.

మస్క్‌ ట్వీట్లపై ప్రజల ఆసక్తి క్షీణిస్తోందని సదరు ఇంజనీరు వాదించాడు. దీనికి సంబంధించి గూగుల్‌ ట్రెండ్స్ డేటాను కూడా చూపించాడు. అంతేకాదు ట్విటర్ అల్గారిథమ్ మస్క్‌ పట్ల పక్షపాతంగా ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఇంజనీర్ చెప్పాడు. అంతే మరుక్షణమే యూ ఫైర్డ్‌ అంటూ  మస్క్‌ మండిపడటం హాట్‌ టాపిగ్‌ నిలిచింది.  అయితే  తాజా పరిణామం ట్విటర్‌ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 

కాగా ట్విటర్ డేటా ప్రకారం మస్క్ చేసిన ట్వీట్లు మామూలుగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ సాధిస్తాయనీ, కానీ మస్క్ 128 మిలియన్ల ఫాలోయర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని ఫార్చ్యూన్ నివేదిక  వ్యాఖ్యానించింది

మరిన్ని వార్తలు