షాకింగ్‌..రిలయన్స్‌కు గట్టి దెబ్బ..! గత ఏడాది కంటే తక్కువ..

21 Apr, 2022 08:42 IST|Sakshi

క్యూ4లో లాభం 65 శాతం డౌన్‌ 

న్యూఢిల్లీ: రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీ ఆర్‌ఐఐఎల్‌ గతేడాది (2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 1.06 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 3 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 19 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెరిగింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఆర్‌ఐఐఎల్‌)గా పేర్కొనే కంపెనీ ప్రధాన కార్యకలాపాలు పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన కాగా.. పెట్రోలియం ప్రొడక్టుల రవాణాతోపాటు.. పైపులైన్ల ద్వారా  నీరు, అద్దెకు కన్‌స్ట్రక్షన్‌ మెషినరీ, ఇతర ఇన్‌ఫ్రా సపోర్ట్‌ సర్వీసులను సైతం అందిస్తోంది. ముంబై సహా మహారాష్ట్ర, గుజరాత్‌లోని సూరత్, జామ్‌నగర్‌ బెల్టులలో కార్యకలాపాలు కేంద్రీకరించింది. 

చదవండి: లాభాల్లో టాటా ఎలక్సీ జోరు..ఇన్వెస్టర్లకు భారీ నజరానా..!

మరిన్ని వార్తలు