రిలయన్స్‌ డీల్‌: అమెజాన్‌కు సమన్లు

10 Nov, 2020 20:47 IST|Sakshi

సాక్షి,ముంబై: ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ రీటైల్‌, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్‌కు సంబంధించి అమెజాన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌ మధ్యంతర ఉత్తర్వులతో ఈ ఒప్పందంలో అమెజాన్‌ జోక్యంపై ఫ్యూచర్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది. దీనిపై స్పందించాల్సిందిగా అమెజాన్‌ను కోరింది.  (అమెజాన్‌కు భారీ ఊరట : రిలయన్స్ డీల్‌కు బ్రేక్)

ఒక రోజంతా ఎఫ్‌ఆర్‌ఎల్, ఎఫ్‌సిపిఎల్, రిలయన్స్, అమెజాన్‌ తరఫున రోజువారీ వాదనలు విన్న జస్టిస్ ముక్త గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దీనిపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక స​మాధానం ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌ఎల్ దావాపై అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సిపిఎల్), రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌ఎల్) లకు సమన్లు ​​జారీ చేసింది స్టేట్‌మెంట్లను దాఖలు చేయాలని కోరింది. అమెజాన్ లేవనెత్తిన దావా నిర్వహణ సామర్థ్యాన్ని కూడా బహిరంగంగా ఉంచుతామని కోర్టు తెలిపింది. దీనిపై బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. (రిలయన్స్‌ చేతికి ‘ఫ్యూచర్‌’ రిటైల్‌)

కాగా రిలయన్స్‌ రీటైల్‌ ఫ్యూచర్‌ రీటైల్‌ డీల్‌ను వ్యతిరేకించిన అమెజాన్‌ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీనిపై  స్పందించిన కోర్టు అక్టోబర్ 25 న అమెజాన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు