రిలయన్స్‌ క్యూ3 లాభాలు ఢమాల్‌, జియో అదుర్స్‌

20 Jan, 2023 20:16 IST|Sakshi

సాక్షి,ముంబై:  ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ క్యూ3 నికర లాభం 15 శాతం క్షీణించింది. 2022 డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఇందులో కన్సాలిడేటెడ్ నికర లాభం 15శాతం తగ్గి రూ. 15,792 కోట్లకుచేరింది.  ఇది  అంతకు ముందు సంవత్సరం రూ. 18,549 కోట్లుగా ఉంది.  

రిలయన్స్‌ ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ.2,20,592 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇది రూ.1,91,271 కోట్లు. అటు రిలయన్స్‌ బలమైన రిఫైనింగ్ మార్జిన్లు,ఇంధన డిమాండ్‌తో చమురు-రసాయనాల వ్యాపారం లాభపడింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా తమ టీమ్స్‌ బలమైన నిర్వహణ పనితీరులో అద్భుతంగా  వర్క్‌ చేశాయని రిలయర్స్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ ముఖేశ్‌ అంబానీ  సంతోషం వెలిబుచ్చారు.

జియో లాభం జూమ్‌
కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ  జియో ప్లాట్‌ఫారమ్‌లు నికర లాభాలలో 28.6 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.4,881 కోట్లను సాధించింది.  ఆదాయం 20.9 శాతం వృద్ధిచెంది 24,892 కోట్లుగా ఉంది. EBITDA 25.1 శాతం పెరిగి 12,519 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ రిటైల్
రిటైల్ విభాగం రిలయన్స్‌ రీటైల్‌  వ్యాపారం సంవత్సరానికి 6.2 శాతం వృద్ధితో రూ. 2,400 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 18.6 శాతం పెరిగి రూ.60,096 కోట్లకు చేరుకుంది. EBITDA 24.9 శాతం పెరిగి రూ.4,773 కోట్లకు చేరుకుంది.

O2C
చమురు నుంచి రసాయనాల (O2C) వ్యాపార ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,44,630 కోట్లకు చేరుకుంది. EBITDA 2.9 శాతం పెరిగి రూ.13,926 కోట్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు