పెట్టుబడుల జోరు: రిలయన్స్ జోష్ 

23 Sep, 2020 09:42 IST|Sakshi

సాక్షి, ముంబై: వరుస నష్టాల తరువాత దేశీయ మార్కెట్లు బుధవారం తేరుకున్నాయి. సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంతో  38044 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 11242 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రిలయన్స్ రీటైల్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ  కేకేఆర్ ద్వారా భారీ పెట్టుబడులను సాధించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్  3 శాతానికి పైగా  ఎగిసింది.  ఇంకా  విప్రో, ఇన్ఫో సిస్, బ్రిటానియీ, హెచ్ సీఎల్ టె క్, సన్  ఫార్మా, ఆసియన్ పెయింట్స్, టైటన్ కంపెనీ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్ టెల్, టాటా స్టీల్,జేఎస్ డబ్ల్యూ స్టీల్,  భారతి ఇన్ ఫ్రాం, గ్రాసిం నష్టపోతున్నాయి.  (రిలయన్స్ రీటైల్ : రూ. 5500 కోట్ల పెట్టుబడి)

మరిన్ని వార్తలు