‘వరల్డ్‌ వైడ్‌ వెబ్‌’ కోటకు బీటలు

12 Mar, 2021 13:54 IST|Sakshi

‘చరిత్రలో ఈరోజు ఏం జరిగెను?’ అనే కొచ్చెన్‌కు వినిపించే జవాబులలో బెర్నర్స్‌-లీ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ (www) ఇన్వెంటర్‌గా సుపరిచితుడైన లీ 12 మార్చి, 1989లో తొలి సారిగా ఇన్‌ఫర్‌మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం గురించి ప్రతిపాదించాడు. అది ఇంతై.. ఇం తింతై...వెబ్‌డింతై ప్రపంచాల మధ్య హద్దులు చెరిపేసింది. ‘ప్రపంచం ఒక పెద్ద గ్రామం అయిపోయింది. దేశాలన్నీ గల్లీలైపోయా యి. ఆ గల్లీలో జరిగే విషయాలు ఈ గల్లీకి వాళ్లకు తెలియడం ఎంతసేపని...’ అని మనం సంబరాల్లో మునిగిపోతుంటాం. ఈలోపే ‘చాల్లేండి సంబడం’ అని ఆకాశవాణి ఉరుముతుంది.

ఏమైంది?
రాబోయే కాలంలో ఇంటర్‌నెట్‌ కంటే ‘స్ప్లింటర్ నెట్‌’ పేరు మాత్రమే ఎక్కువగా వినబడుతుంది. ‘వరల్డ్‌ వైడ్‌ వెబ్‌’ అనే కోటకు బీటలు పడతాయి. ఈ రోజుల్లో సమాచారాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదు. అందుకే దేశాలు సమాచారభద్రత విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తమ సమాచారం బయటికి పోకుండా, బయటి సమాచారం లోనికి  రాకుండా గోడలు కడుతున్నాయి. అదే స్ప్లింటర్ నెట్. స్ప్లింట్(ముక్కలు చేయడం), ఇంటర్‌నెట్‌లను కలిపితే ‘స్ప్లింటర్ నెట్‌’ అయిందన్నమాట. ప్రపంచంలోని కొన్ని దేశాలు సొంత ఇంటర్నెట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఉదా: ఇరాన్‌-హలాల్‌ ఇంటర్నెట్‌. ఈ గోడల వికేంద్రీకరణ దేశాలు దాటి రాష్ట్రాల వరకు రావచ్చు. జిల్లాల వరకూ కూడా రావచ్చు!.

చదవండి:

ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు

సింగిల్ ఛార్జ్ తో 240 కి.మీ ప్రయాణం

>
మరిన్ని వార్తలు