Rishabh Pant: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్‌ పంత్‌..! దినేష్‌ కార్తీక్‌ సరసన...!

20 Oct, 2021 15:15 IST|Sakshi

భారత్‌లో క్రిప్టోకరెన్సీపై అత్యంత ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తోన్న వారిలో భారత్‌ సుమారు 10 కోట్ల మందితో నిలిచిన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీ తో పాటుగా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ)కు ‍కూడా భారత్‌లో ఆదరణ లభిస్తోంది. 

రిషబ్‌పంత్‌ కూడా ఎన్‌ఎఫ్‌టీలోకి...!
భారత్‌లో అమితాబ్‌ బచ్చన్‌, సన్నిలియోన్‌, సల్మాన్‌ ఖాన్‌ లాంటి ప్రముఖ నటులు ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటుగా ఎన్‌ఎఫ్‌టీ విషయంలో టీమిండియా క్రికెటర్లు కూడా సై అంటున్నారు. కొద్ది రోజుల క్రితం టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ 2018లో నిదాహస్‌ ట్రోఫిలో కొట్టిన చివరి ఫ్లాట్‌ సిక్స్‌ను వీడియో రూపంలో ఎన్‌ఎఫ్‌టీగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్ఎఫ్‌టీను ఆవిష్కరించిన తొలి భారత క్రీడాకారుడిగా దినేష్‌ కార్తీక్‌ నిలవడం గమనార్హం. ఇప్పుడు దినేష్‌ కార్తీక్‌ సరసన మరో టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌పంత్‌ కూడా చేరనున్నాడు.
చదవండి: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..!

ప్రపంచంలోనే అధికారికంగా లైసెన్స్‌​ పొందిన తొలి క్రికెట్‌ ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫామ్‌ రారియోతో భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌పంత్‌ జత కట్టనున్నాడు. రారియో ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పలు రిషబ్‌పంత్‌ ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లో ముఖ్యంగా ఆస్ట్రేలియా గబ్బా స్టేడియంలో రిషబ్‌ ఆడిన విరోచిత ఇన్నింగ్స్‌, ఇంగ్లాండ్‌తో అహ్మాదాబాద్‌లో ఆడిన ఇన్నింగ్స్‌, అంతేకాకుండా ఐపీఎల్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా పనిచేసిన తీరు ఆడియో, వీడియో ఎన్‌ఎఫ్‌టీ రూపంలో రానున్నట్లు తెలుస్తోంది. రారియో ప్లాట్‌ఫామ్‌నుపయోగించి క్రికెట్‌ అభిమానులు ఆయా క్రికెటర్లకు సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీలను వేలంలో గెలుచుకోవచ్చునని కంపెనీ సీఈవో అంకిత్‌ వాద్వా పేర్కొన్నారు.  

ఎన్‌ఎఫ్‌టీ అంటే..!
ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్‌ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి  వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్‌ఎఫ్‌టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్‌లో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. 
చదవండి:  సల్మాన్‌ ఖాన్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత...!

మరిన్ని వార్తలు