పెట్రో ధరలపై ‘ధర్మ్‌ సంకట్‌’

21 Feb, 2021 04:49 IST|Sakshi
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల విపరీతమైన సమస్య. దీనికి ధరలు తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయ సమాధానం ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం అన్నారు. ‘వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్‌ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ‘ధర్మ్‌ సంకట్‌’ పరిస్థితి. వినియోగదారులకు తుది ధర లేదా రిటైల్‌ ధర సహేతుకమైన స్థాయిలో ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్గాన్ని గుర్తించాలి’ అని నిర్మల వ్యాఖ్యానించారు. ఇంధన ధరలను చమురు మార్కెటింగ్‌ సంస్థ(ఓఎంసీ)లు నిర్ణయిస్తాయ ని, వీటిపై కేంద్రానికి నియంత్రణ ఉండదని ఆమె పేర్కొన్నారు. చమురు దిగుమతులు, శుద్ధి చేయడం, పంపిణీ, లాజిస్టిక్స్‌ వంటి ఖర్చులను బట్టి ఓఎంసీలు చమురు ధరలను నిర్ణయిస్తాయన్నారు.
 

మరిన్ని వార్తలు