డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌తో చేతులు కలిపిన తనిష్క్‌ 

23 Nov, 2022 13:23 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రీమియం స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌తో రిటైల్‌ జ్యువెలరీ బ్రాండ్‌ తనిష్క్‌ చేతులు కలిపింది. వివాహ వేడుకల వేళ ఓటీటీ వేదికగా ‘ద గ్రేట్‌ ఇండియన్‌ బ్రైడ్‌’ పేరుతో సరికొత్త షోను విడుదల చేయనుంది. దేశంలో భిన్న సంస్కృతి, విభిన్న ప్రాంతాలకు చెందిన ఐదుగురు వధువులు తనిష్క్‌ కో-బ్రాండ్‌ రివా రూపొందించిన వివాహ ఆభరణాలను ధరించి తమ పెళ్లి నాటి అనుభూతులను నటి శ్రియా పిల్గాంకర్‌తో పంచుకోనున్నారు. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?)

ప్రతి సంప్రదాయానికి ఆభరణం రివా అనే ట్యాగ్‌లైన్‌తో కంటెంట్‌ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్‌ చేశామని టైటాన్‌ మార్కెటింగ్‌ జీఎం రంజనీ కృష్ణస్వామి తెలిపారు. ‘‘టైటాన్‌ వంటి సుప్రసిద్ధ బ్రాండ్‌తో కలిసి పనిచేయడంతో పాటు వినూత్న కథనం ద్వారా సబ్‌స్క్రైబర్లతో మా బంధం మరింత బలపడుతుంది’’ అని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (మరో టెక్‌ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?)

మరిన్ని వార్తలు