రోల్స్ రాయిస్‌ మరో నూతన ఆవిష్కరణ

4 Oct, 2020 14:45 IST|Sakshi

ఇంగ్లండ్‌: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ ఆటోమొబైల్స్ మేకర్ రోల్స్ రాయిస్‌ మరో నూతన ఆవిష్కరణతో మన ముందుకొస్తోంది. అత్యంత వేగంగా ఎగిరే విద్యుత్‌ విమానాన్ని రూపొందిస్తున్న ఈ సంస్థ.. అందులో వినియోగించే టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విమానానికి ‘అయాన్‌ బర్డ్‌’గా నామకరణం చేసిన రోల్స్‌ రాయిస్‌ ఇంజనీర్లు.. రెప్లికా వెర్షన్‌ టెస్ట్‌ ఫలితాలతో సంతప్తి వ్యక్తం చేస్తున్నారు. 500 హార్స్‌ పవర్‌ సామర్థ్యం కలిగి ఉండడంతో ఈ విద్యుత్‌ విమానం రికార్డు స్థాయి వేగాన్ని క్షణాల్లో అందుకోగలదని రోల్స్‌ రాయిస్‌ డైరెక్టర్‌ రాబ్‌ వాట్సన్‌ వివరించారు.

ఈ విమానం టెక్నాలజీని పరీక్షించేందుకు ఉపయోగించిన విద్యుత్‌.. 250 ఇళ్లకు వినియోగించే విద్యుత్‌తో సరిసమానమని చెప్పారు. సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలూ తీసుకుని టెస్ట్ నిర్వహించామని ఆయన చెప్పారు. టెక్నాలజీ టెస్ట్‌ విజయవంతంగా పూర్తవడంతో అతి త్వరలోనే అన్ని పరికరాలనూ విమానంలో అమర్చుతామని తెలిపారు. 2050 నాటికి కాలుష్య రహిత విమానాల తయారీలో తాము కీలకం కాబోతున్నామని వాట్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా