Anand Mahindra:టైం మిషన్‌ కావాలంటున్న ఆనంద్‌ మహీంద్రా..! ఎందుకోసం..?

7 Aug, 2021 16:22 IST|Sakshi

మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా గురించి తెలియని వాళ్లు ఏవరు ఉండరు..! సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లకు ఆసక్తి కర విషయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో మరో ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేశారు. ట్విట్‌లో తనకు ఆర్జెంటుగా టైం మిషన్‌ కావాలని రాసుకొచ్చారు. టైం మిషన్‌ను ఉపయోగించి వెంటనే భూతకాలానికి వెళ్లాలని తన ట్విట్‌లో తెలిపారు. 

అసలు ఏంటి..! టైం మిషన్‌ గొడవ..!     
ఆనంద్‌ మహీంద్రా తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో 1903 నాటి ముంబై తాజ్‌ హోటల్‌ చిత్రాన్ని షేర్‌ చేశారు. దేశంలోని అత్యుత్తమ హోటల్లో ముంబై తాజ్‌ ఒకటి. తాజ్‌ హోటల్‌ను 1903 డిసెంబర్‌ 1 ఓపెన్‌ చేశారు. ఆ సమయంలో తాజ్‌లో ఒక్కరోజు స్టే చేయడం కోసం అయ్యే ఖర్చు కేవలం రూ. 6 మాత్రమే. తాజ్‌ హోటల్‌ ఓపెనింగ్‌ బ్రోచర్‌ను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

దేశ వ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించడం కోసం వెంటనే ఒక టైం మిషన్‌ సహాయంతో తిరిగి ఆనాటి రోజులకు వెళ్లాలని ట్విటర్‌ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం తాజ్‌ హోటల్‌లో ఒక రోజు స్టే చేసేందుకు అయ్యే ఖర్చు  రూ. 15 వేల నుంచి రూ. 18 వేల వరకు ఉండనుంది.

మరిన్ని వార్తలు