జూలైలో ఊపందుకున్న ఎకానమీ: ఇక్రా

24 Aug, 2021 05:45 IST|Sakshi

ముంబై: భారత్‌ ఎకానమీ జూలైలో భారీగా రికవరీ అయినట్లు రేటింగ్‌ సంస్థ– ఇక్రా పేర్కొంది. సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షలు క్రమంగా సడలించడం దీనికి కారణమని వివరించింది. పారిశ్రామిక, సేవల రంగాలు, రవాణా, టోల్‌ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. 13 నాన్‌–ఫైనాన్షియల్‌ ఇండికేటర్లను చూస్తే, అందులో 10 సానుకూల ఫలితాలను ఇచ్చాయని వివరించింది.  జీఎస్‌టీ ఈ–వే బిల్లులు, ఇంధన వినియోగం, విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి, వెహికిల్‌ రిజిస్ట్రేషన్, దేశీయ పాసింజర్‌ ట్రాఫిక్‌ వంట విభాగాలు 2021 జూన్‌తో పోల్చితే 2021 జూలైలో గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపింది. ఇదే వరవడి కొనసాగవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు