రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌.. కొత్త లుక్‌ ఇలా ఉంటుందా?

11 Aug, 2022 11:16 IST|Sakshi

ఒకప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రోడ్డుపై వెళ్తుంటే..అందరి చూపు దానిపైనే ఉండేది. అందుకే ఆ బండి సైలెన్సర్‌కు సపరైట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ముఖ్యంగా యూత్‌ అందరికి లైఫ్‌లో ఒక్కసారైన ఈ బైక్‌ను కొనుక్కోవాలనే డ్రీం ఉంటుంది. అలాంటి ఇండియన్‌ మోస్ట్‌ బైక్‌ బ్రాండ్‌ అయిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్‌ను విడుదల చేయనుంది.  

భారత్‌లో రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ హంటర్‌ 350ని విడుదల చేసింది. ఈ తరుణంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకొని, కాంపిటీషన్‌లో పై చేయి సాధించాలంటే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను తయారు చేయడం తప్పని సరని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. 

అందుకే 2026 నాటికి రాయల్‌ ఎన్ ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యూకేకి చెందిన 'ఎలక్ట్రిక్‌ క్లాసిక్‌ కార్స్‌' సంస్థ 2020లో ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌ను ఎలక్ట్రిక్‌ బైక్‌గా మార్చేసింది. 125 సీసీ రేంజ్‌ బైక్స్‌ సైతం వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. భారత్‌లో సైతం ఇదే తరహాలో రాయల్‌ ఎన్‌ ఫీల్డ్ బైక్స్‌ను ఎలక్ట్రిక్‌ బైక్స్‌గా మార్చేసి మార్కెట్‌కు పరిచయం చేస్తుందా? అనే సందేశాలు వ్యక్త మవుతున్నాయి. 

అవును, నాణ్యత, పనితీరు, బ్రాండ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ బైక్స్‌ను అందించడం తొందరపాటులో లేదని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్‌ బైక్స్‌కు డిమాండ్‌ ఉన‍్నప్పటికీ ..భవిష్యత్‌లో తయారు చేయనున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ మోడళ్లు  ఫీల్‌, సపరైట్‌ ఐకానిక్‌ లుక్‌ ఉండేలా ఆ సంస్థ శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి👉 డుగ్గుడుగ్గు మంటూ..రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్‌ వచ్చేస్తోంది!

మరిన్ని వార్తలు