రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి మరో కొత్త బైక్‌..! ఆ సెగ్మెంట్‌లో చవకైన బైక్‌గా..!

9 Mar, 2022 18:08 IST|Sakshi

ప్రముఖ టూవీలర్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ భారత మార్కెట్లలోకి మరో కొత్త బైక్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ బైక్‌ ఆఫ్‌ రోడ్‌ సెగ్మెంట్‌లో చవకైన బైక్‌గా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. 

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 411
ఆఫ్‌ రోడ్‌ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన హిమాలయన్‌ మోడల్‌ అత్యంత ప్రచుర్యాన్ని పొందింది. హిమాలయన్‌ బైక్‌ కంటే తక్కువ ధరలో కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 411ను మార్చి 15 న లాంచ్‌ చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 సంబంధించిన పలు వివరాలు ఈ ఏడాది ప్రారంభంలోనే లీక్ అయ్యాయి. ఈ బైక్‌ యోజ్దీ స్క్రాంబ్లర్‌తో పోటీ పడనుంది.

డిజైన్‌ విషయానికి వస్తే..!
న్యూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రాంబ్లర్  ఆఫ్‌రోడ్‌ బైక్‌ హిమాలయన్ ఆధారంగా రూపొందించబడింది.  రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 డ్యూయల్-పర్పస్ టైర్స్‌తో 19-అంగుళాల ఫ్రంట్ వీల్‌ను పొందనుంది. ఈ బైక్‌లో జెర్రీ క్యాన్ హోల్డర్స్‌, పొడవైన విండ్‌స్క్రీన్ తొలగించబడ్డాయి. ఇతర అప్‌గ్రేడ్‌లలో ట్రిప్డ్ నావిగేషన్ పాడ్‌తో కూడిన రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కాస్ట్ మెటల్-ఫినిష్డ్ హెడ్‌ల్యాంప్ కౌల్, స్ప్లిట్ సీట్లు, రివైజ్డ్ సైడ్ ప్యానెల్స్‌తో రానుంది. అల్యూమినియం సంప్ గార్డ్, అర్బన్ బ్యాడ్జ్ ప్లేట్ కూడా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రాంబ్లర్‌లో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిమీ వరకు తగ్గింది.

ఇంజన్‌ విషయానికి వస్తే..!
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌ 24.3 bhp సామర్థ్యంతో , 32 Nm గరిష్ట టార్క్‌ను 411 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ అందించనుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బైక్ సస్పెన్షన్ , బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను కూడా కలిగి ఉండనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411  హిమాలయన్ బైక్‌ కంటే కొంత తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌ ధర రూ.2 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఇక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ బైక్‌ ధర రూ. 2.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది.

చదవండి: అత్యధిక మైలేజ్‌ ఇచ్చే కారును లాంచ్‌ చేసిన మారుతి సుజుకీ..!

మరిన్ని వార్తలు