బాష్‌ పెట్టుబడుల బాట ఐదేళ్లలో రూ. 200 కోట్లు 

13 Jul, 2022 10:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం బాష్‌ లిమిటెడ్‌ అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీలపై రానున్న ఐదేళ్లలో రూ. 200 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. డిజిటల్‌ మొబిలిటీ విభాగంలోనూ పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ ఎండీ సౌమిత్ర భట్టాచార్య పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రెండంకెల వృద్ధిని అందుకోవడంపై ఆశావహంగా ఉన్నప్పటికీ అప్రమత్తతతో వ్యవహరించనున్నట్లు మార్చితో ముగిసిన గతేడాది(2021–22) వార్షిక నివేదికలో భట్టాచార్య తెలియజేశారు. సరఫరా సవాళ్లు, చిప్‌ల కొరత, చైనా లాక్‌డౌన్, రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం తదితర పలు సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటున్నట్లు వివరించారు. దీంతో ఓవైపు వడ్డీ రేట్ల పెరుగుదల, మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాల పరిస్థితులు తలెత్తినట్లు అభిప్రాయపడ్డారు. గతేడాది కంపెనీ రూ. 11,105 కోట్ల ఆదాయం, రూ. 1,217 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు