నకిలీ నోట్ల ముఠా హల్‌చల్‌: గుట్టలుగా రూ.2 వేల నోట్ల కట్టలు

12 Nov, 2022 15:55 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు అయింది.  ఈ సందర్బంగా థానే క్రైమ్ బ్రాంచ్ భారీ ఎత్తున నకిలీ కరెన్సీని  స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి రూ. 2 వేల నకిలీ నోట్ల 400 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్‌ ఆర్టీఐ సమాధానం)

ఇదీ చదవండి: అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?

నిందితులు రామ్ శర్మ, రాజేంద్ర రౌత్‌ను అరెస్ట్‌  చేసినట్టు పోలీసులు ప్రకటించారు. వీరి నుంచి భారీ మొత్తంలో రూ.2000 నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.8 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులిద్దరూ పాల్ఘర్ నివాసితులని తెలిపారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్‌కు తరలించాలని ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. కాసర్వాడవలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు  ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెట్‌వర్క్‌ ఎంత విస్తరించిందీ దర్యాప్తు చేస్తున్నారు. (ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ కమింగ్‌ సూన్‌, సీఈవో ట్వీట్‌ వైరల్‌)

(హ్యుందాయ్‌ భారీ ఆఫర్‌, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్‌)

(ప్రేమలో పడిన మిలిందా గేట్స్‌, కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?)

మరిన్ని వార్తలు