రూ. 2,500 కోట్లతో శ్యామ్‌ స్టీల్‌ విస్తరణ

28 Feb, 2023 00:46 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టీఎంటీ ఉక్కు కడ్డీల తయారీ సంస్థ శ్యామ్‌ స్టీల్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ రిటైల్‌ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే అయిదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు డీలర్‌ డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ లలిత్‌ బెరివాలా తెలిపారు. అలాగే నటుడు విజయ్‌ దేవరకొండను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు పేర్కొన్నారు.

ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ. 2,500 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ప్లాంటుపై రూ. 1,000 కోట్లు, మరో కొత్త ప్లాంటుపై రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు బెరివాలా చెప్పారు. ప్రస్తుత  సామర్థ్యం వార్షికంగా 0.7 మిలియన్‌ టన్నులుగా ఉండగా, దీన్ని 1 మిలియన్‌ టన్నులకు పెంచుకుంటున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల టర్నోవరు నమోదు కాగా వచ్చే మూడేళ్ల వ్యవధిలో దీన్ని రూ. 9,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు