డ్రీమ్‌ఫోక్స్‌ ఐపీవోకు రిటైలర్ల క్యూ

25 Aug, 2022 05:55 IST|Sakshi

తొలి రోజే 5 రెట్లు అధికంగా బిడ్స్‌

న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసులు పొందేందుకు వీలు కల్పించే అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ఫోక్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రిటైలర్ల నుంచి భారీ డిమాండ్‌ నెలకొంది. ఇష్యూ తొలి రోజు(బుధవారం) రిటైల్‌ విభాగంలో 5.4 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 308–326 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 94,83,302 షేర్లను విక్రయానికి ఉంచింది. 1.03 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి.

వెరసి 1.1 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఇష్యూ శుక్రవారం(26న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా మంగళవారం యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా రూ. 253 కోట్లు సమకూర్చుకుంది. ఆఫర్‌లో భాగంగా ప్రమోటర్లు మొత్తం 1.72 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచారు. ఐపీవో తదుపరి చెల్లించిన మూలధనంలో ఇది 33 శాతం వాటాకు సమానం! రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

మరిన్ని వార్తలు