రెసిషన్‌ భయాలు: రుపీ మరోసారి క్రాష్‌

16 Sep, 2022 11:13 IST|Sakshi

సాక్షి, ముంబై: గ్లోబల్ మాంద్యం భయాలతో డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి బలహీనపడింది ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ  దేశాలకు కూడా  ఆర్థిక కష్టాలు తప్పవనే ప్రపంచ బ్యాంకు,  ఐఎంఎఫ్‌ వ్యాఖ్యల  నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనే రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 79.82 వద్దకు చేరింది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు మాంద్యంలోకి వెళ్లవచ్చని తాజాగా హెచ్చరించాయి. దీనికి తోడు అమెరికాలోద్రవ్యోల్బణం స్థాయి కూడా ఊహించని రీతిలో ఉండటతో వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటువడ్డన భారీగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్లను సెంటిమెంట్‌ను దెబ్బ తీసాయి. గురువారం ముగింపు 79.7012తో పోలిస్తే, కీలకమైన 80 స్థాయికి అతి వేగంగా జారిపోతోంది.  దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు కూడా రూపాయి క్షీణతకు దారి తీసింది.సె న్సెక్స్‌ ఒక దశలో ఏకంగా 750 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు, అనంతరం 59500 దిగువకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన మద్దతుస్థాయిని 18వేలను, ఆ తరువాత 17750 స్థాయిని కూడా  కోల్పోయింది.
 

మరిన్ని వార్తలు