కరోనా సెగ : రుపీ ఢమాల్‌

19 Apr, 2021 14:08 IST|Sakshi

సాక్షి,ముంబై: కరోనా మహమ్మారి ప్రకంపనలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో  ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి భయాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్‌లో భారీ సెల్‌ ఆఫ్‌ కనిపించింది. ఫలితంగా 1400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 48 వేల దిగువకు పడి పోయింది. అటు ఫారెక్స్‌మార్కెట్‌లో దేశీయ కరెన్సీ రూపాయి కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంది. డాలరు మారకంలో ఏకంగా 52 పైసలు క్షీణి​చి 74.87 స్థాయికి చేరింది. శుక్రవారం రూపాయి 74.35 వద్ద స్థిరపడింది.  డాలర్ ఇండెక్స్ 0.10 శాతం పెరిగి 91.64 వద్ద ఉంది. మరోవైపు గ్లోబల్  మార్కెట్లో ఆయిల్‌ ధరలు  బలహీనపడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌ 0.37 శాతం పడిపోయి 66.52 డాలర్లకు చేరుకుంది.  (దలాల్‌ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు)

కాగా దేశంలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి రోజువారీ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్‌దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా ఐదో రోజు రెండున్నర లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరో 2,73,810మంది కరోనా బారిన పడగా, గడిచిన 24 గంటల్లో 1619 మంది కరోనాతో  మరణించారు. (మరో దఫా ‘ఉద్దీపన’ చర్యలు: రాజీవ్‌ కుమార్‌)

మరిన్ని వార్తలు