India Rupee: రూపాయి మహాపతనం, మరో కొత్త కనిష్టం

1 Jul, 2022 10:19 IST|Sakshi

సాక్షి, ముంబై: రూపాయి  మరో మహాపతనాన్ని నమోదు చేసింది. వరుస రికార్డు కనిష్టాలను నమోదు చేస్తున్న  దేశీయ కరెన్సీ రూపాయి  శుక్రవారం మరో ఆల్‌ టైం కనిష్టాన్ని రికార్డు చేసింది.  యుఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి 79.11 వద్దకు చేరింది. వరుసగా ఆరో సెషన్‌లో కూడా రూపాయి విలువ దిగజారుతుండటం ట్రేడర్లను ఆందోళనకు గురి చేస్తోంది. గత సెషన్‌లో  3 పైసలు పడిపోయి రికార్డు స్థాయిలో 79.06 వద్ద ముగిసింది. 

మరోవైపు గత సెషన్‌లో దాదాపు 3 శాతం క్షీణించిన చమురు ధరలు ఈరోజు (శుక్రవారం) ప్రారంభ ట్రేడింగ్‌లోనే చుక్కలు చూపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83 సెంట్లు లేదా 0.8 శాతం పెరిగి 109.86 డాలర్లకు చేరుకుంది. అలాగే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌ ఏకంగా 770 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 226  పాయింట్లు పతనమైంది. 

>
మరిన్ని వార్తలు