రూపాయికి ‘శక్తికాంత్‌’ బలం

28 Aug, 2020 05:40 IST|Sakshi

48 పైసలు లాభంతో 73.82 వద్ద ముగింపు

ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనడంలో తమ వద్ద ఉన్న అస్త్రాలు అయిపోలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చేసిన ప్రకటన భారత కరెన్సీ– రూపాయికి బలాన్ని ఇచ్చింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడింది. 73.82 వద్ద ముగిసింది. దేశంలోకి కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, దేశీయ సానుకూల ఈక్విటీ మార్కెట్, ఆరు కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ బలహీనత వంటి అంశాలూ రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. 74.30 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. 73.81–74.36 శ్రేణిలో కదలాడింది.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు