రూపాయి పతనం: ఆమెకు నోబెల్‌ ఇవ్వాల్సిందే! సోషల్‌ మీడియా కౌంటర్లు

17 Oct, 2022 17:13 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు  ఇంటర్నెట్‌లో ప్రకంకపనలు పుట్టిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర విలువ పెరుగుతోందని పేర్కొన్నారు డాలర్‌ నిరంతరం బలపడుతూ ఉండటంతో అన్ని కరెన్సీలు బలహీన పడుతున్నాయి. కానీ భారత రూపాయి అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీల కంటే మెరుగ్గా ఉందని  పేర్కొన్నారు.

దీంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు వ్యంగ్య బాణాలు విమర్శలతో హల్‌చల్‌ చేస్తున్నారు. ‘రుపీ ఈజ్‌ నాట్‌ స్లైడింగ్‌’ ట్విటర్లో  ట్రెండింగ్‌లో నిలిచింది.  హైదరాబాద్‌కు చెందిన  ప్రొ. నాగేశ్వరావు స్పందిస్తూ మన కేంద్ర మంతత్రి నోబెల్‌ బహుతి ఇవ్వాల్సిందే నంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.  బంగారం ఒకటి చెప్పనా.. రూపాయి విలువతగ్గితేనే.. డాలర్‌ పెరిగేది అంటూ మరో యూజర్‌ కమెంట్‌ చేశారు. ఇది ఇలా ఉంటే  సోమవారం డాలరు మారకంలో  రూపాయి  16 పైసలు నష్టంతో 82.35 వద్ద ముగిసింది. 

>
మరిన్ని వార్తలు