మూణ్నాళ్ల ముచ్చటేనా? రూపాయి మళ్లీ ఢమాల్‌!

3 Aug, 2022 17:24 IST|Sakshi

సాక్షి ముంబై:  దేశీయ  కరెన్సీ  రూపాయి మరోసారి  నష్టాలను మూటగట్టుకుంది. డాలరుమారకంలో 80 స్థాయినుంచి కాస్తకోలుకుందని సంబరపడేలోపే భారీ పతనాన్ని  నమోదు చేసింది.  నాలుగు రోజుల లాభాలకు చెక్‌పెడుతూ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో బుధవారం రూపాయి ఏకంగా 68 పైసలు కుప్పకూలింది. 78.70 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి చివరికి రోజు కనిష్ట స్థాయి 79.21 వద్ద స్థిరపడింది. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా వాణిజ్య లోటు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 31 బిలియన్ల డాలర్లకు పెరిగింది. దీనికి తోడు కరోనా సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా వార్‌, అంతర్జాతీయ చమురు ధరలు, కొరత లాంటి ఆందోళనకు తోడు తాజాగా తైవాన్‌ ముప్పు భయాల నేపథ్యంలో రూపాయి మరోసారి ఢమాల్‌ అంది. (స్వీట్‌ 16: త్వరపడండి అంటూ ఊరిస్తున్న ఇండిగో!)

నిరుత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో రూపాయి అమెరికా డాలరుతో బలహీనపడింది. కాగా మంగళవారం, రూపాయి 53 పైసలు  లాభపడింది. 11 నెలల్లో దాని అత్యుత్తమ సింగిల్ డే లాభంతో నెల గరిష్ట స్థాయి 78.53 వద్ద ముగిసింది. మరోవైపు గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.95 శాతం క్షీణించి  99.58 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీలతో పోలిస్తే  డాలర్ ఇండెక్స్ 106.19కి చేరుకుంది.  

అలాగే యూఎస్‌ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన,అమెరికా చైనాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ యుఎస్ డాలర్  లాభపడిందని BNP పరిబాస్ పరిశోధన విశ్లేషకుడు అనూజ్ చౌదరి చెప్పారు. అలాగే ఫెడ్‌ ఇటీవల వడ్డీరేట్ల పెంపుతో బలపడిందని, అయితే జాబ్‌ డేటా డాలర్‌ లాభాలను పరిమితం చేసిందని వ్యాఖ్యానించారు. జులైలో 17 నెలల్లో మొదటిసారిగా భారతదేశ ఎగుమతులు స్వల్పంగా తగ్గాయి. అయితే  జూలైలో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో  31 బిలియన్ల డాలర్లకు పెరిగింది. ముడి చమురు దిగుమతులు 70 శాతానికి పైగా పెరిగాయి.  (టాటా టియాగో కొత్త వెర్షన్‌ వచ్చేసింది! ధర చూస్తే...)

అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చివరికి లాభాల్లోనేముగిసాయి. సెన్సెక్స్ 214.17 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 58,350.53 పాయింట్ల వద్ద,  ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 42.70 పాయింట్లు లేదా 0.25 శాతం జంప్ చేసి 17,388.15 వద్ద ముగిసింది. 

ఇది కూడా చదవండి:  నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్‌ సెటైర్లు: తీవ్ర చర్చ

మరిన్ని వార్తలు