17 పైసలు బలపడిన రూపాయి

12 Aug, 2021 13:13 IST|Sakshi

ముంబై: చాలా రోజుల తర్వాత డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు నుంచి పెట్టుబడుల వరద పారడంతో రూపాయి క్రమంగా బలం పుంజుకుంది. డాలర్‌ మారకంతో పోల్చితే 17 పైసలు లాభపడింది. గత కొంత కాలంగా ఇండియన్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆల్‌టైం హైలను తాకినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

బుధవారం ఒక్క రోజే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 238 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు అమెరికా మార్కెట్‌లో డాలర్‌ ఒడిదుడులకు లోనవుతోంది. ఫలితంగా గురువారం మార్కెట్‌లో డాలర్‌లతో పోల్చితే రూపాయి గణనీయంగా బలపడింది. ఏకంగా 17 పైసల వరకు విలువను పెంచుకుని 74.27 పైసల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతకు ముందు డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.44 దగ్గర కొనసాగింది. 
 

మరిన్ని వార్తలు