Rupee ఎన్నాళ్లకెన్నాళ్లకు: లాభాల్లో రూపాయి

27 Oct, 2022 10:20 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి చాలా రోజుల తరువాత లాభాల్లోకి మళ్లింది. ఆరంభంలోనే  అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 67 పైసలు  జంప్‌ చేసి 82.14 స్థాయిని నమోదు చేసింది.   ప్రస్తుతం 50 పైసలు లాభంతో  ట్రేడ్‌ అవుతోంది. మంగళవారం నాటి ముగింపు 82.72 పోలిస్తే డాలర్‌తో రూపాయి 82.20 స్థాయిని తాకింది. అటు  డాలర్ ఇండెక్స్ సుమారు 109.75 వద్ద ఒక నెలలో దాని కనిష్ట స్థాయికి చేరింది. ఫలితంగా దేశీయ సావరిన్ బాండ్లు కూడా పెరిగాయి. ఈ పరిణామం రూపాయికి సానుకూలంగా మారింది. 

కాగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఫెడ్‌ వడ్డీరేటు పెంపు అంచనాల మధ్య డాలర్‌ బలహీనత కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌ 300 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17750  పాయింట్లకు ఎగువన ట్రేడ్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు