ఈక్విటీ షాక్ : 20 పైసలు క్షీణించిన రూపాయి

22 Sep, 2020 16:00 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ  రూపాయి మంగళవారం నష్టాల్లో ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీనత నేపథ్యంలో రూపాయి 20 పైసలు నష్టపో్యింది. అమెరికా  డాలరు మారకంలో రూపాయి 20 పైసలు క్షీణించి 73.58 వద్ద ముగిసింది. 73.50 వద్ద బలహీనంగా ట్రేడింగ్ ను ఆరంభించి,ఆ  తరువాత మరింత పతనమై  73.64 కనిష్టాన్ని నమోదు చేసింది. .డాలర్‌తో  పోలిస్తే  సోమవారం  7 పైసల లాభంతో 73.38 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అటు డాలర్ ఇండెక్స్ 0.04 శాతం  నష్టంతో 93.61 వద్దకు  ఉంది.  ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్ కు 0.65 శాతం పెరిగి 41.71 డాలర్లకు చేరుకుంది.

మరోవైపు  దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో వరుసగా నాలుగవ సెషన్ లో  కూడా నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్  300 పాయింట్లు కుప్పకూలి 37734 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11153 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  దీంతో  కీల  సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. ప్రధానంగా ఆటో షేర్లు భారీగా నష్టపోగా, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్, రియాల్టీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఒక్కో శాతానికి పైగా పడిపోయాయి. మరోవైపు, ఐటీ, ఫార్మాలాభపడ్డాయి. జీ, గెయిల్, అదానీ పోర్ట్స్, భారతి ఇన్ ఫ్రా టెల్, టాటా మటార్స్, ఇండస్ ఇండ్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,  కోటక్ మహీంద్రా బ్యాంక్  టాప్ లూజర్స్ గాఉన్నాయి.  హెచ్‌సిఎల్ టెక్, టీసీఎస్,  టెక్ మహీంద్రా, గ్రాసిమ్ సిప్లా, డాక్టర్ రెడ్డీస్ , భారతి ఎయిర్‌టెల్, ఎస్ బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్  లాభాలను ఆర్జించాయి.

మరిన్ని వార్తలు