డాలర్‌ దెబ్బతో రూపీ ఢమాల్

30 Mar, 2021 11:33 IST|Sakshi

భారీగా పుంజుకున్న అమెరికా డాలర్‌

34 పైసలు పతనమైన   రూపాయి

సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ  34 పైసలు క్షీణించింది.  ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలరు పుంజుకోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలరుతో పోలిస్తే రూపాయి 34 పైసలు తగ్గి 72.85 స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.01 శాతం పెరిగి 92.94 కు చేరుకుంది. శుక్రవారం రూపాయి 72.51 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 870 పాయింట్లు ఎగియగా,నిఫ్టీ 263పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. హోలీ కారణంగా ఫారెక్స్ మార్కెట్  సోమవారం పనిచేయని సంగతి తెలిసిందే. (మెటల్‌ షైన్ ‌: సెన్సెక్స్‌ 800 పాయింట్లు జంప్‌)

మరిన్ని వార్తలు