రూపాయి ఢమాల్..డాలర్‌కి జోష్!

9 May, 2022 21:38 IST|Sakshi

జాతీయ, అంతర్జాతీయ పరిణాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరు మారకంలో దేశీయ కరెన్సీ విలువ  జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది.

పీటీఐ కథనం ప్రకారం..సోమవారం అమెరికా డాలరుతో పోలిస్తే భారత కరెన్సీ విలువ పతనమైంది. 60పైసలు తగ్గి 76.90 నుండి 77.50 వద్ద ట్రేడింగ్‌తో ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 77.17 వద్ద దిగువన ప్రారంభమైంది. చివరికి దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 60 పైసలు తగ్గి 77.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి తన జీవితకాల కనిష్ట స్థాయి 77.52కి చేరుకుంది.

గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి ఆందోళనల ఫారెక్స్‌ మార్కెట్‌పై పడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.  పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ నుండి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల పెంపు  కారణంగా డాలర్ రెండు దశాబ్దాలలో అత్యధిక స్థాయికి చేరుకుంది. అదనంగా, చైనాలో కఠినమైన లాక్‌డౌన్, మూడవ నెలలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిస్పందనగా రష్యా చమురును నిషేధించాలనే యూరప్  ప్రణాళిక, వస్తువుల ధరలను పెంచడం వల్ల ఆర్థిక వృద్ధి ప్రమాదాలు మందగించడం డాలర్‌ రేటు పెరగుదలకు ఊతమిచ్చింది. 

మరిన్ని వార్తలు