73 పైసలు లాభపడిన రూపాయి

1 Sep, 2020 16:47 IST|Sakshi

కీలకమైన  రూ. 73  ఎగువకు  రూపాయి

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయిమంగళవారం భారీగా పుంజుకుంది. డాలరు మారకంలో 73 పైసలు ఎగిసి 72.87 వద్ద ముగిసింది. తద్వారా డాలరుతో కీలకమైన 73 స్థాయిని అధిగమించింది. ఈక్విటీ మార్కెట్ల బలానికి తోడు, డాలరు  బలహీనత నేపథ్యంలో ఫారెక్స్ ట్రేడర్లు కొనుగోళ్లు కరెన్సీకి ఊతమిచ్చాయి.  

ద్రవ్యతపై ఒత్తిడిని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ చర్యలను ప్రకటించడంతోసెంటిమెంట్ బలపడిందని వ్యాపారులు తెలిపారు. 73.18 వద్ద ప్రారంభమైన రూపాయి అనంతరం మరింత పుంజుకుంది. 72.75 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని, 73.19 వద్ద కనిష్టాన్నితాకింది. చివరకు 72.87 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.25 శాతం తగ్గి 91.91 వద్దకు చేరింది. మరోవైపు  లాభాలతో రోజంతా ఉ త్సాహంగా కొనసాగిన సెన్సెక్స్ 272 పాయింట్లు ఎగిసి 38900 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 11470 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు