బలహీనంగా గ్రామీణ మార్కెట్‌

5 Jan, 2023 13:07 IST|Sakshi

న్యూఢిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్‌ బలహీనంగా ఉందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీ మారికో తెలిపింది. పట్టణ మార్కెట్, ప్రీమియం విభాగాలు స్థిర వృద్ధిని కొనసాగించాయని వివరించింది. పండగల జోష్‌తో మొత్తం మీద ఈ రంగం డిమాండ్‌లో కొంత మెరుగుదల నమోదైందని తెలిపింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌తో పోలిస్తే డిసెంబర్‌ త్రైమాసికంలో తమ కంపెనీ సింగిల్‌ డిజిట్‌ వృద్ధి నమోదు చేసిందని మారికో వెల్లడించింది.

‘కీలక ముడి పదార్థాల ధరలు, విక్రయ ధరల్లో కొంత స్థిరత్వాన్ని చూశాం. నిర్వహణ లాభాలు  మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ వ్యాపారంలోనూ వృద్ధి సాధించాం. స్థిర వృద్ధి, లాభదాయకతను అందించాలనే ఆకాంక్షను కొనసాగిస్తున్నాం’ అని మారికో వివరించింది.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్‌ టికెట్‌ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు