భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్‌!

20 Jul, 2022 10:31 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు 5 కార్గోల ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ను సరఫరా చేయడంలో రష్యా డిఫాల్ట్‌ అయ్యింది.రష్యన్‌ గ్యాస్‌ సరఫరా చేసే కంపెనీల్లో ఒకదానిపై ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. 

వివరాల్లోకి వెడితే దేశీ దిగ్గజం గెయిల్‌కి ఏటా 2.85 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతి కోసం రష్యన్‌ సంస్థ గాజ్‌ప్రోమ్‌కి చెందిన సింగపూర్‌ విభాగంతో దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. ఈ సింగపూర్‌ విభాగం ప్రస్తుతం జర్మనీకి చెందిన అనుబంధ సంస్థ కింద పనిచేస్తోంది. 

ఉక్రెయిన్‌తో యుద్ధంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలపై రష్యా ప్రతీకార ఆంక్షలు విధించిన దేశాల్లో జర్మనీ కూడా ఉంది. ఫలితంగా సింగపూర్‌ విభాగానికి రష్యా గ్యాస్‌ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఎల్‌ఎన్‌జీ సరఫరాకు ఆటంకం కలిగింది. గెయిల్‌ ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్‌ సమకూర్చుకునే
ప్రయత్నాల్లో ఉంది.     

మరిన్ని వార్తలు