భారత్‌కు భారీ తగ్గింపుతో ముడిచమురును ఆఫర్‌ చేసిన రష్యా

31 Mar, 2022 22:07 IST|Sakshi

ఉక్రెయిన్‌-రష్యా యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో  బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించినప్పటీ నుంచి అమెరికాతో సహా పలు యూరోపియన్‌ దేశాలు కూడా ఆంక్షలను విధించాయి. దీంతో రష్యాలో ముడిచమురు నిల్వలు భారీగా పెరుకుపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా భారత్‌కు భారీ తగ్గింపుతో ముడిచమురును ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. 

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో... బ్యారెల్‌ క్రూడాయిల్‌పై భారత్‌కు ఏకంగా 35 డాలర్ల తగ్గింపును రష్యా ఆఫర్‌ చేసిందని బ్లూమ్‌బర్డ్‌ నివేదించింది. అంతేకాకుండా రష్యాకు చెందిన అత్యంత విలువైన యూరల్స్‌ గ్రేడ్‌ క్రూడాయిల్‌ అందించినట్లు తెలిపింది. క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకుగాను భారత్‌ను రష్యా ప్రోత్సహించింది. ఈ ఏడాది 15 మిలియన్‌ బ్యారెల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా కోరినట్లు బ్లూంబర్గ్‌ పేర్కొంది. 

చదవండి: హల్‌చల్‌ చేస్తోన్న టాటా మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు